వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా వజ్రకరూరులో ఘన నివాళి

 




వజ్రకరూరు: ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పీఏసీ సభ్యుడు వై. విశ్వేశ్వర్ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వజ్రకరూరు మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.


ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు.


కార్యక్రమానికి మండల అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఎంపీపీ దేవి భాయ్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు డి. సురేష్, మండల ఉపాధ్యక్షుడు ఉస్మాన్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయ సుశీలమ్మ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లెల జగదీష్, వజ్రకరూరు టౌన్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి, బీఎల్‌ఏ మండల ఇన్‌చార్జి అభి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ప్యాపిలి కిష్ట, బీమా వీరభద్ర గౌడ్, శ్యామ్, రాకెట్ల బాబు, నెట్టికల్లు సాయపురం నరసింహులు, గోబ్ర్యా నాయక్, ఎద్దాటి రమేష్, కె. వెంకటేష్, రఘుపతి, ఆవుల సందీప్, ప్యాపిలి వీర నాగార్జున, రాములు నాయక్, వెంకటేష్ నాయక్, ఎస్. కిష్టప్ప, జి. హరి, తిమ్మారెడ్డి, కె. పరమేష్, రాజారెడ్డి, చంద్ర, ధర్మపురి అనంత కుమార్, వెంకటేష్, విజయ్, ముత్యాలు, శీనా నాయక్, సికిందర్, రాకెట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.