ఉరవకొండ
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఉరవకొండ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మాలపాటి శ్రీనివాసులను ఉరవకొండ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.
శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాలపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. జర్నలిస్టుల ఐక్యతే సంఘ బలోపేతానికి మూలమని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే వృత్తిపరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జెమిని రామాంజనేయులు, జమీల్ బాషా, సాయి కృష్ణ, ఉమాపతి సుధాకర్త త
దితరులు పాల్గొని మాలపాటి శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలిపారు.
