వజ్రకరూరు జులై 11:
జనాభా సమస్యలకు ప్రాముఖ్యత కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎం పి హెచ్ ఈ ఓ గురు ప్రసాద్ పేర్కొన్నారు. వజ్రకరూర్ మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నుండి స్థానిక తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు జనాభా దినోత్సవం పై అవగాహన కల్పించారు. ఎం పి హెచ్ ఈ ఓ గురు ప్రసాద్ మాట్లాడుతూ.... కుటుంబం ఆరోగ్యంగా ఉంటే దేశం సౌభాగ్యంగా ఉంటుందని తెలిపారు. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం వేడుకలు నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. బిడ్డ బిడ్డకు మధ్య వ్యవధి పాటిస్తే ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మించుకోవచ్చు అని వారు తెలిపారు. ముఖ్యంగా తల్లి కావడానికి సరియైన వయస్సు స్త్రీలకు 18 సంవత్సరాలు పురుషునికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహాలు చేయాలన్నారు. 18 సంవత్సరాలు లోబడి ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు కానీ లేదా జరగబోయేటట్లు కానీ మీరు గుర్తిస్తే బాల్య వివాహాన్ని నిలుపుదల చేయుటకు వెంటనే సంబంధిత అధికారులకు, పోలీస్, అంగన్వాడి ఆశ కార్యకర్తలకు లేదా 1098, 181, 112, 100 ఫోన్ చేసి తెలపాలన్నారు. వివరాలు తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా లేదా రెండు విధించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నాగ శంకర్, ఫార్మసిస్ట్ రామచంద్రనాయక్, హెల్త్ అసిస్టెంట్ సంపత్ కుమార్, స్టాఫ్ నర్స్ సుజాత, ఏఎన్ఎం లక్ష్మీ, ఆశా వర్కర్ ఆనందలక్ష్మి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
