వజ్రకరూర్, జులై 18:
వజ్రకరూర్ మండలం పెద్ద ప్యాపిలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాకలి ఎర్రి స్వామి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎర్రి స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అశోక్ కుమార్, సీపీ వీరన్న, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు డీ. సురేష్(డిష్ ), జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లెల జగదీష్, స్థానిక నాయకులు మాబు సాబ్, కిష్టా చంద్ర నాయక్, ధనుంజయ, విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
