ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

 

తిరుపతి, జూలై 4:

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధి


కారులు చేపట్టిన ఆకస్మిక దాడుల్లో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్య లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

చేపల పెంపకం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50 లక్షల రుణానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి ఓ రైతు నుంచి రూ.6 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్య రూ.3 లక్షలు లంచం స్వీకరిస్తుండగా పట్టుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, రసాయన పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనతో తిరుపతి జిల్లా మత్స్యశాఖలో కలకలం రేగింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.