నాసర్‌జీ, వలరాజు
:అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) అనంతపురం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ. కుళ్లాయిస్వామిని సంఘం నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగించారు.
ఈ మేరకు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు, ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ సోమవారం అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల వచ్చిన ఆరోపణల కారణంగా వారం రోజుల క్రితం జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో కుళ్లాయిస్వామిని ఏఐఎస్‌ఎఫ్ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి కుళ్లాయిస్వామిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతో, అతడిని ఏఐఎస్‌ఎఫ్ ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగించినట్లు తెలిపారు.
ఇక నుంచి కుళ్లాయిస్వామికి ఏఐఎస్‌ఎఫ్‌తో ఎలాంటి సంబంధం లేదని వలరాజు, నాసర్‌జీ స్పష్టం చేశారు.