జేఎన్‌టీయూలో డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం



అనంతపురం జులై21:- 
అనంతపురం జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం–నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. చెన్నై రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ బి. హనుమంతు మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, ఎన్‌డీపీఎస్ చట్టంలోని కఠిన శిక్షలపై వివరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని సూచించారు. అనంతరం "డ్రగ్స్‌కు నో – విద్యకు ఎస్", "మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి – మీ భవిష్యత్తును కాపాడుకోండి" అనే నినాదాలతో విద్యార్థుల చేత డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.