చాబాలలో ఘనంగా వై యస్ ఆర్ జయంతి వేడుకలు


 వజ్రకరూరు మండలం చాబాల గ్రామం లో స్థానిక కరెమ్మవ్వ దేవాలయం దగ్గర ఘనంగా దిగవంత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి 77 వ జయంతి వేడుకలు 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు చక్రిస్వామి, M.K గోవర్ధన్, టైలర్ లాలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా ఆయన చేసిన సేవలు మారలేనివని అయన చేసిన కార్యక్రమాలను స్మరించుకుని ప్రతి ఒక్క యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో వైస్సార్ సీపీ నాయకులు సాకే ప్రతాప్, ఎర్రిస్వామి, శంకరయ్య, మనోజ్, దినేష్, నానీ, శాంతరాజ్, సీనియర్ నాయకులు మహిపతి,పుల్లయ్య, దావీదు, కర్రెప్ప, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు