నీట్ పేపర్ లికేజ్ కి భాద్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి!




రాష్ట్ర వ్యాప్తంగా24 తేదిన జరిగేబోయే విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయండి పోస్టర్ విడుదల 
–ఏఐఎఫ్డిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి తరుణ్ 

దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఏర్పడిన అనుమానాలను నివృత్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యా వ్యవస్థపై విశ్వాసం దెబ్బతినడానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS)రాష్ట్ర వ్యాప్తంగా 24 తేదిన జరిగేబోయే విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయండి పోస్టర్ విడుదల ఏఐఎఫ్డిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి తరుణ్ 

విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోసం ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణించడం అత్యంత ఆందోళనకరమన్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆవేదనను వినకుండా మౌనంగా ఉండడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలో విఫలమైన వారికి పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదు. దేశ యువత విశ్వాసాన్ని కోల్పోయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి, విద్యా వ్యవస్థపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు అతీతమైన అంశమని, విద్యా వ్యవస్థను కార్పొరేట్ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే విధానాలను ఏఐఎఫ్డిఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. దేశ యువతకు న్యాయం జరిగే వరకు విద్యార్థి ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఏఐఎఫ్డిఎస్ డిమాండ్లు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.
సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.
పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరపాలి.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మౌనం వీడి విద్యార్థుల ఆవేదనను గౌరవించాలి. లేకపోతే దేశవ్యాప్తంగా విద్యార్థులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఏఐఎఫ్డిఎస్ హెచ్చరిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే పోరాటంలో ఏఐఎఫ్డిఎస్ ఎల్లప్పుడూ ముందుంటుంది