ఢిల్లీ లో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణం...పీ.యస్. యూ ,





 *నీట్ పరీక్ష పత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలినీ కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన*

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష పత్రం లీకేజీ ఘటనపై న్యాయమైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అత్యంత దురదృష్టకరమని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఉరవకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల నందు నిరసన చేయడం జరిగింది అని పీఎస్ యూ జిల్లా కార్యదర్శి భాస్కర్ నియోజవర్గ అధ్యక్షులు తులసి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో నీట్ పరీక్ష పత్రం లీకేజీ వంటి ఘటనలు విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పారదర్శక విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసు బలగాలను ప్రయోగించడం అత్యంత దారుణమని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కల్పించిందని, ఆ హక్కును అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.నీట్ పరీక్ష పత్రం లీకేజీ ఘటనపై సమగ్ర, స్వతంత్ర విచారణ జరిపి అసలు బాధ్యులను శిక్షించాలని,విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, శాంతియుత నిరసనలపై పోలీసు దమనకాండను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.