విడపనకల్:అనంతపురం జిల్లా, విడపనకల్ మండలం ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో ఉన్న ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్‌లో గురువారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే గదిలో ఉంటున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల మెడపై గుర్తు తెలియని గాట్లు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలికల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
అర్ధరాత్రి అసలేం జరిగింది?: గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో హాస్టల్‌లో వింత శబ్దాలు రావడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురై గదుల నుండి బయటకు పరుగులు తీశారు. ఒకే గదిలో ఉంటున్న నలుగురు ఇంటర్ విద్యార్థినుల్లో ఇద్దరి మెడపై అనుమానాస్పద రీతిలో గాట్లు ఉండటాన్ని గమనించి హాస్టల్ విద్యార్థినులంతా భయంతో వణికిపోయారు.
తల్లిదండ్రులు, విద్యార్థినుల ప్రధాన ఆరోపణలు:
నిర్లక్ష్యం - గోప్యత: రాత్రి 2 గంటలకు ఘటన జరిగితే, మరుసటి రోజు సాయంత్రం వరకు తల్లిదండ్రులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. యాజమాన్యం ఈ విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేసిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రహస్యంగా ఇంటికి పంపివేత: గాయపడిన విద్యార్థినుల్లో ఒకరిని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, కనీస వైద్య పరీక్షలు కూడా చేయించకుండా హుటాహుటిన ఇంటికి పంపించేశారు. దీనివెనుక ఏదైనా దాచే కుట్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గాలికి భద్రతా చర్యలు: సుమారు 130 మంది బాలికలు ఉంటున్న హాస్టల్‌లో రాత్రిపూట కనీస భద్రతా సిబ్బంది లేరు. ఇన్‌చార్జి వార్డెన్ కూడా రాత్రిపూట హాస్టల్‌లో ఉండరని, గస్తీ లేకపోవడం వల్ల బయటి వ్యక్తులు సులభంగా ప్రవేశించే పరిస్థితి ఉందని విద్యార్థినులు అధికారుల తీరుపై విమర్శలు
