పాత కడమలకుంట అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు విజయవంతం

 


వజ్రకరూరు, ఆగస్టు 6: 


పాత కడమలకుంట అంగన్వాడి కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, నవజాత శిశువులకు మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలే ఉత్తమ ఆహారమని, తల్లిపాలు శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని గ్రామంలోని బాలింతలకు, గర్భిణులకు, ప్రజలకు అవగాహన కల్పించారు.


కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు అనసూయమ్మ, సుంకమ్మ, అంగన్వాడి సహాయకులు శివలక్ష్మి, శ్రావణి పాల్గొని తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అలాగే బాలింతలు తల్లిపాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామంలోని బాలింతలు, గర్భిణులు, మహిళలు, ప్రజలు పాల్గొని తల్లిపాలపై అవగాహన పెంపొందించుకున్నారు .