అనంతపురం , ఆగస్టు 6:
విజయవాడలో నిర్వహించనున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన బీజేపీ గిరిజన మోర్చా నాయకులు గురువారం అనంతపురం నుంచి విజయవాడకు బయలుదేరారు.
రాష్ట్ర స్థాయి సమావేశంలో గిరిజన సంక్షేమం, పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, గ్రామస్థాయి వరకు పార్టీ విస్తరణతో పాటు గిరిజన ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా గిరిజన మోర్చా పదాధికారులు, జిల్లా నాయకులు పాల్గొననున్నారని మూడ్ కేశవ్ నాయక్ తెలిపారు.
