ఉరవకొండ, ఆగస్టు 6:
పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో 2026-27 సంవత్సరానికి సంబంధించి టెంకాయలు విక్రయించుకునే హక్కు, కొబ్బరి చిప్పలు సేకరించుకునే హక్కులకు నిర్వహించాల్సిన సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం వాయిదా పడింది.
ఈ వేలం ప్రక్రియను ఆగస్టు 7వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
వేలం నిర్వహించే కొత్త తేదీ, సమయాన్ని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల పాటదారులు తదుపరి ప్రకటనను గమనించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.
