జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు – చేనేత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని చేనేత కులస్తులకు, చేనేత కార్మికులకు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
నేతన్న సేవ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడి ఖాతాలో రూ.25 వేల చొప్పున జమ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చెంగల మహేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు చందా రాము కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని 71,500 మంది చేనేత కార్మికులకు మొత్తం రూ.179.53 కోట్లను వారి ఖాతాల్లో జమ చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.
అలాగే చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మకు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సమస్త చేనేత కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పలు వినతులు చేశారు. చేనేత వస్త్రాలు, చేనేత ముడి సరుకులపై విధిస్తున్న జీఎస్‌టిని పూర్తిగా రద్దు చేయాలని, రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి కనీసం మూడు సెంట్ల ఇంటి స్థలం కేటాయించి హౌసింగ్ పథకం ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ప్రతి జిల్లాలో ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి చేనేత కార్మికుడికి చేనేత పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో చందా రాము, పెద్దకోట్ల శ్రీనివాసులు, చెంగల మహేష్, చెంగల కాశీనాథ్, పెద్దకోట్ల రవి, బుట్టా తిప్పయ్య, సందా బాలాజీ, నిమ్మల వెంకటరమణ, ముక్కర బాలచంద్ర, కటికం మల్లేష్, గుర్రం హరిదాసు పాల్గొన్నారు.
