ఉరవకొండ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల NSS జ్ఞాపకాలు

 


ఉరవకొండ: అనంతపురం జిల్లాలోని ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సాధించిన సామాజిక అనుభవాలను పూర్వ విద్యార్థులు గుర్తుచేసుకున్నారు. జాతీయ సేవా పథకం (NSS) విభాగ ఆధ్వర్యంలో ఉరవకొండ సమీపంలోని పెనకచర్ల డ్యామ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో వీరంతా భాగస్వాములయ్యారు.

ఈ కార్యక్రమంలో నాటి హిస్టరీ అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్ కో-ఆర్డినేటర్ హేమచంద్రన్ నేతృత్వంలోకరణం వెంకటేశ్వర ప్రసాద్,రామాంజనేయులు, జీలాన్ బాషా, వీరేష్, వెంకట కృష్ణ మరియు ఇతర విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు.

విశేషమేమిటంటే, ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులలో ఒకరైన మధుసూధన రావు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా (మదనపల్లె) కలెక్టరేట్‌లో జిల్లా రెవిన్యూ అధికారి (DRO)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థి దశలోనే ఎన్.ఎస్.ఎస్ ద్వారా అలవడిన సేవాభావం, పర్యావరణ స్పృహ సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఎంతగానో తోడ్పడతాయని ఈ సంఘటన నిరూపిస్తోంది.