రాయదుర్గంలో AISF 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

 విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను ఉధృతం చేస్తాం: AISF

రాయదుర్గం, ఆగస్టు 11: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి AISF అనంతపురం జిల్లా కోశాధికారి ఆంజనేయులు అధ్యక్షత వహించారు.

మాజీ AISF అనంతపురం జిల్లా సహాయక కార్యదర్శి కావలి కోట్రేష్ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో AISF ఆవిర్భవించిందని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని అప్పట్లో AISF పిలుపునిచ్చిందన్నారు.

స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, సమానత్వం, సామాజిక న్యాయం  అంశాలపై AISF అనేక పోరాటాలు నిర్వహించిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేతదితరయకపోతే విద్యార్థులను చైతన్యపరిచి ఉద్యమాల ద్వారా సమస్యల పరిష్కారానికి AISF కృషి చేస్తుందని అన్నారు.

విద్యార్థుల సమస్యలు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు పరిష్కారమయ్యేలా క్రమశిక్షణతో, నిబంధనలకు అనుగుణంగా ఉద్యమాలను నిర్వహించడంలో AISF ముందుంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా AISF పలు డిమాండ్లను ప్రభుత్వాల ముందుంచింది. విద్యకు బడ్జెట్‌లో 50 శాతం కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ విద్యార్థులకు నెలకు రూ.3,000 భృతి ఇవ్వాలని కోరారు.అలాగే విద్యను కార్పొరేట్, ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని, క్యాంపస్‌లలో ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించాలని కోరారు.కార్యక్రమంలో AISF రాయదుర్గం నాయకులు రామదాసు, భాను, లింగప్ప, గోవర్ధన్, మధు, మణితో పాటు కళాశాల విద్యార్థి నాయకులు, మాజీ విద్యార్థి సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, సమానత్వం, సామాజిక న్యాయం  అంశాలపై AISF అనేక పోరాటాలు నిర్వహించిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేతదితరయకపోతే విద్యార్థులను చైతన్యపరిచి ఉద్యమాల ద్వారా సమస్యల పరిష్కారానికి AISF కృషి చేస్తుందని అన్నారు.

విద్యార్థుల సమస్యలు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు పరిష్కారమయ్యేలా క్రమశిక్షణతో, నిబంధనలకు అనుగుణంగా ఉద్యమాలను నిర్వహించడంలో AISF ముందుంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా AISF పలు డిమాండ్లను ప్రభుత్వాల ముందుంచింది. విద్యకు బడ్జెట్‌లో 50 శాతం కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ విద్యార్థులకు నెలకు రూ.3,000 భృతి ఇవ్వాలని కోరారు.అలాగే విద్యను కార్పొరేట్, ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని, క్యాంపస్‌లలో ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించాలని కోరారు.కార్యక్రమంలో AISF రాయదుర్గం నాయకులు రామదాసు, భాను, లింగప్ప, గోవర్ధన్, మధు, మణితో పాటు కళాశాల విద్యార్థి నాయకులు, మాజీ విద్యార్థి సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.