పట్టిసీమ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకుంటాం.. మచిలీపట్నం సమన్వయ కమిటీ భేటీలో వైవీబీ రాజేంద్రప్రసాద్.. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని శ్రేణులకు పిలుపు
మచిలీపట్నం, (ట్రూ టైమ్స్ ఇండియా):కృష్ణా జిల్లాలోని శివారు నియోజకవర్గాలకు తాగు, సాగు నీరు అందించే సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, గుడివాడ ప్రాంతాల్లో ప్రజలు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పట్టిసీమ కాలువకు అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సామర్థ్యం పెంచేలా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎంకు విజ్ఞప్తి చేస్తామన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక పోరులో విజయభేరి మోగించాలని ఉద్బోధించారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మహిళా నేతలు రాజేంద్రప్రసాద్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.