వినాయక చవితి ఉత్సవం పై సమావేశం నిర్వహించిన సీఐ శ్రీనివాసులు

 



యాడికి మండలం 

   వినాయక చవితి పండుగ ను పురస్కరించుకొని వినాయక విగ్రహాల ఏర్పాటుపై సమావేశమును వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్న కమిటీ సభ్యులను పిలిచి సమావేశంను సీఐ శ్రీనివాసులు ఎస్ఐ గోపాల్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారిరువురు పలు సూచనలు అందజేశారు 

 14వ తారీఖున వినాయక విగ్రహమును పూజ చేసి కూర్చోబెట్టి 16వ తారీఖున నిమజ్జనం చేసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగినది అలాగే వినాయక మండపాల ఏర్పాటు గురించి శ్రద్ధ వహించాల్సిందిగా కమిటీ వారికి సూచించడం జరిగింది 

ఎటువంటి షార్ట్ సర్క్యూట్ వంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండపాలను దగ్గర ఉండి మంచిగా నిర్మించుకోవాలని, సౌండ్ సిస్టమును మంచిగా ఏర్పాటు చేసుకోవాలని భక్తిశ్రద్ధలతో పండుగ నిర్వహించుకోవాలని సంప్రదాయమైన విధానాలను పాటించాలని ఆయన పలు సూచనలు ఇవ్వడం జరిగింది నిమజ్జనం జరిపే స్థలం గురించి తదుపరి చర్చించి సమయం, స్థలమును మరల ప్రకటిస్తామని అందరూ కలిసికట్టుగా సోదరభావంతో వినాయక చవితి పండుగ ను నిర్వహించుకోవాల్సిందిగా సీఐ శ్రీనివాసులు ఆదేశించడం జరిగింది 

ఈ కార్యక్రమంలో పలువురు యాడికి మండలంలోని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది