ఉరవకొండ సెప్టెంబర్ 9:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బుజ్జి రెడ్డిని అనంతపురం కలెక్టర్ ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే పురుషోత్తం మాట్లాడుతూ.. ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాలికల గిరిజన గురుకుల పాఠశాలకు కనీసం సొంత భవనం లేకపోవడం చాలా దారుణమని తెలిపారు.
బాలికల గిరిజన గురుకుల పాఠశాలకు వెంటనే సొంత భవనం కేటాయించాలని, అలాగే మౌలిక వసతులు కల్పించాలని కోరారు. దాంతో పాటు ఎస్టీ హాస్టళ్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఉరవకొండ నియోజకవర్గానికి ఏకలవ్య మోడల్ స్కూల్ మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు గిరిజనులకు రావలసిన సబ్సిడీ లోన్లు వెంటనే మంజూరయ్యే విధంగా కృషి చేయాలని చైర్మన్ బుజ్జి రెడ్డిని సాకే పురుషోత్తం కోరారు.
ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ విజిల్స్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ పోలా వీరాంజనేయులు పాల్గొన్నారు.
