వ్యక్తి గత పరిశుభ్రత పై పాల్తూరు లో అవగాహన

 ఉరవకొండ  సెప్టెంబర్ 12:ఐ సీ డీ యస్ ప్రాజెక్ట్ ఉరవకొండ సీడీపీఓ B.N. శ్రీదేవి ఆదేశాల మేరకు సూపర్‌వైజర్ మేడమ్ B. పుష్పవతి ఆధ్వర్యమున అంగన్‌వాడీ కేంద్రం 5, పాల్తూరు గ్రామం నందు "పోషణ మాసం" నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తల్లిలకు, గర్భవతులకు, బాలింతలకు పోషకాహారం, బరువులు, ఎత్తులు, రక్తహీనత, బాల్యవివాహాలు, పరిశుభ్రత ఇంకా మొదలగు విషయాలపై అవగాహన తీసుకు రావడం జరిగింది.

ఇందులో అంగన్‌వాడీ టీచర్స్ దుర్గ, లక్ష్మీదేవి, మల్లేశ్వరి, నాగవేణి, రాధ, ఆదిలక్ష్మి, వంటక్క ఇంకా పెద్దలు హాజరు కావడం జరిగింది.