వజ్రకరూరు:
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల ప్రాథమిక (MPP) పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) నూతన పాలకవర్గ ఎన్నిక ప్రశాంతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. కమిటీ నూతన ఛైర్మన్‌గా ఆకుల వెంకటేశులు, వైస్ ఛైర్మన్‌గా కేశన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. వెంకటేశులు పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో గ్రామ పెద్దల సమక్షంలో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేష్, రాము, దేవేంద్రలతో పాటు గ్రామ పెద్దలు చాకలి ఎర్రీస్వామి, పంపాపతిస్వామి, అనంతయ్య, లింగమూర్తి, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లకు ఉపాధ్యాయులు, గ్రామస్థులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు, విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్తుకు నూతన కమిటీ శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు.
