ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

 


అనంతపురం సెప్టెంబర్ 9:

అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను స్థానిక ఆర్‌అండ్ బి (R&B) గెస్ట్ హౌస్‌లో బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి మూడ్ కేసవ నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గణేష్‌లతో పాటు పలువురు నాయకులు ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను పొన్నాడ, శాలువాతో చిరు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన ప్రాంతాల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.