True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఘనంగా అంగన్వాడీ పౌష్టికాహార మాసోత్సవం


 

ఉరవకొండ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాముఖ్యత, చిన్నారుల వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. అలాగే ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పోషణ్ అభియాన్ పథకాల గురించి వివరించారు.


ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళామోర్చ నాయకులు దగ్గుపాటి సౌభాగ్య టీడీపీ నాయకులు ప్యారం కేశవానంద , జంగిడి గోవిందు ,భాస్కర్ , మండల ఎంఆర్వో అరుణ , డాక్టర్ , ఎంపీపీ శ్రీమతి సుంకు రత్నమ్మ , సీడీపీఓ శ్రీదేవి , సూపర్వైజర్ రాజేశ్వరి , అంగన్వాడీ టీచర్లు గర్భవతులు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

↑