ఉరవకొండ :శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఉరవకొండలోని శ్రీ దుర్గా భవాని అమ్మవారు శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి రూపంలో భక్తులకు దివ్యదర్శనం ఇచేశారు. ఈ పవిత్ర సందర్భంగా నేడు అమ్మవారికి ప్రత్యేక పూజలు, ప్రసాద వితరణ మరియు విశేష అలంకరణలు ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా గిద్దలూరు ఎర్రి స్వామి, నున్న లోకోదారక, చంద్రశేఖర్, ఉప్పర శివ, బసన్న తదితర భక్తులు మరియు భక్తాదులందరికీ అమ్మవారి సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు మరియు మనశ్శాంతి ప్రసాదించాలని శ్రీ దుర్గా భవాని అమ్మవారిని ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ప్రార్థించినట్లు వీరేష్ తెలిపారు.

