True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఎందుకు త్రిబుల్ ఇంజన్?:కే వి రమణ


 

-------------------------- 

     ప్రస్తుతం ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్, పార్లమెంటు,అసెంబ్లీలను వేదికగా చేసుకుని రెండు అంచెలుగా చేస్తున్న అవినీతిని,స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచి,త్రిబుల్ ఇంజిన్ సర్కార్ గా ఏర్పడి, అవినీతిని మూడు అంచలుగా గ్రామస్థాయిలో విస్తరింప చేయడానికి.

     రెండు అంచలుగా హననం చేయబడుతున్న మానవ హక్కులను మూడంచలుగా తుంగలో తొక్కి,ప్రజల ఆస్తులను,మానప్రాణాలను హననం చేయడానికి.

    అడ్డదారులలో గెలిచి, ఏకపక్ష విజయమని ప్రకటించుకుని,ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టడానికి,రాష్ట్ర ఆదాయం అంతా అమరావతికి చేర్చి, పంచుకోవడానికి.మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడానికి.

   ప్రజలకు అత్యవసరాలు అయిన విద్య,వైద్యాన్ని ప్రస్తుతం రెండంచలుగా నిర్వీర్యం చేస్తున్న దాన్ని మూడంచలుగా నిర్వీర్యం చేయడానికి.

    రాష్ట్రంలో రెండు అంచలుగా అమలు జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మూడు అంచలుగా మరింత ఉదృతం చేయడానికి.

    మేధావులను,సోషల్ యాక్టివిష్టులను ప్రశ్నించే గొంతుల పై ప్రస్తుతం ఉన్న రెండింతల నిర్బంధాన్ని మూడింతలు చేయడానికి.

    తమ అబద్ధాలను మూడింతలుగా ప్రచారం చేసు కోవడానికి ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో ప్రభుత్వ డబ్బును తమవారికి దొడ్డి దారిన పంచి పెట్టడానికి.

    ఇప్పుడు ఉన్న రాష్ట్ర డబుల్ అప్పులను త్రిబుల్ చేయడానికి.

    పంచభూతాలను ప్రస్తుతం ఉన్న రెండు భాగాలను,పచ్చ బ్యాచ్ మూడు భాగాలుగా చేసుకుని మరింత సులభంగా పంచుకోవడానికి. 

    అయితే డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడానికి సహకరించినట్లుగా,త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడటానికి ఈవీఎంలు లేవనే అసహనంతో ఎలాగైనా అధికారంలోకి రావడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ చెప్పు చేతులలో పెట్టుకుని ప్రత్యర్థుల నామినేషన్లకు కావాల్సిన ధ్రువపత్రాలను సకాలంలో ఇవ్వకుండా చేసి,నామినేషన్ల ప్రక్రియలోనే ప్రత్యర్థులను ఓడించడానికి సకల ప్రయత్నం చేస్తున్నది.

   ప్రజలు జాగృతి కలిగితే భవిష్యత్తు,లేకుంటే అంధకారమే 

↑