నాగుల పంచమి వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు
తొర్రూరు, ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి, నవంబర్ 12:శుక్రవారం నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తొర్రూరు పట్టణంలోని 10వ వార్డులో గల పుట్ట పరిసరాలను మున్సిపల్ సిబ్బంది ముమ్మరంగా శుభ్రం చేశారు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తునం శ్రవణ్ కుమార్ సహకారంతో ఈ ప్రత్యేక పారిశుద్ధ్య పనులను చేపట్టారు స్థానిక కౌన్సిలర్ మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముద్దసాని సురేష్ స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి పనులను దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా పుట్ట చుట్టుపక్కల పెరిగిన పిచ్చిమొక్కలు తుప్పలు చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు నాగుల పంచమి రోజున వేకువజాము నుంచే మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ముద్దసాని సురేష్ తెలిపారు పండుగ వాతావరణంలో భక్తులు ప్రశాంతంగా పూజలు చేసుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సొంటిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

