కర్నూలు, ట్రూ టైమ్స్ ఇండియా నవంబరు 17, రాయలసీమ ప్రాంత కేంద్రమైన కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కర్నూలు హైకోర్టు సాధన సమితి ప్రతినిధి, న్యాయవాది జి.వి. కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం (నవంబరు 17) ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌లకు రిజిస్టర్ పోస్టు ద్వారా వినతిపత్రం పంపారు.
2026 జూలై 29న కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి నారా లోకేష్ 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని కృష్ణమూర్తి గుర్తు చేశారు. అయితే 90 రోజుల గడువు ముగిసినప్పటికీ బెంచ్ ఏర్పాటు దిశగా తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరిన కృష్ణమూర్తి, బెంచ్ ఏర్పాటు చేయని పక్షంలో రాయలసీమ ప్రజలు, న్యాయవాదులను సమీకరించి తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు.

