True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఆలూరు ఎంపీపీగా వైకుంఠం శ్రీరామ్ ప్రమాణ స్వీకారం.. వైస్ ఎంపీపీగా కురువ నాగవేణి

               

అట్టహాసంగా ఆలూరు ఎంపీపీగా వైకుంఠం శ్రీరామ్ ప్రమాణ స్వీకారం

వైస్ ఎంపీపీగా కురువ నాగవేణి ఏకగ్రీవ ఎన్నిక.. భారీ విజయోత్సవ ర్యాలీతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం

ఆలూరు, నవంబర్ 19, ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి: ఆలూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఆలూరు పట్టణంలోని మూడో ఎంపీటీసీ సభ్యుడు వైకుంఠం శ్రీరామ్ ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా పెద్దహోతూరు గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు కురువ నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైకుంఠం కుటుంబ వారసుడిగా శ్రీరామ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీపీగా ఎన్నిక కావడంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రత్యేక అధికారి సంజీవరాజ్, ఎంపీడీవో మద్దిలేటి స్వామి నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీతో పాటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీగా వైకుంఠం శ్రీరామ్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీలను టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, మాజీ ఇన్‌చార్జి వైకుంఠం శివప్రసాద్, ఆలూరు టీడీపీ పరిశీలకులు తలారి ఆదినారాయణ, జడ్పీటీసీ కొమ్ము రామాంజనేయులు అభినందించారు.

అనంతరం వైకుంఠం శ్రీరామ్ మాట్లాడుతూ ఆలూరు మండల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తన తల్లి వైకుంఠం జ్యోతి సలహాలు, సూచనలతో ముందుకు సాగుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పట్టణంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ ఆరు మండలాల్లో ఎంపీపీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుందని తెలిపారు.

ఈ విజయోత్సవ ర్యాలీలో చిప్పగిరి ఎంపీపీ మీనాక్షి నాయుడు, ఎల్‌ఎల్‌సీడీసీ చైర్మన్ మిక్కిలినేని ప్రసాద్, నాయకులు శేషగిరి, సీనప్ప, విష్ణువర్ధన్ రెడ్డి, నెట్టప్ప, రాజా, పంపన్న గౌడ్, మానేకుర్తి రాజశేఖర్, మెడికల్ షాప్ విజయ్, నరసప్ప, నారాయణ, లక్ష్మన్న, చిన్న ఉచ్చరప్ప, చిన్న యాదవ్, కురువ భాస్కర్, మసాలా జగన్, ముద్దు రంగ, గుళ్యం రామాంజనేయులు, సవారీ, కొమ్ము రాజు తదితరులు పాల్గొన్నారు.

↑