విడపనకల్ ఎంపీపీగా ఎన్నికైన బోయ లీలావతి.. మంత్రి పయ్యావుల కేశవ్‌కు కృతజ్ఞతలు
ఉరవకొండ, ట్రూ టైమ్స్ ఇండియా, నవంబర్ 19: విడపనకల్ మండల ఎంపీపీగా ఎన్నికైన బోయ లీలావతి గురువారం పెద్ద కౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించినందుకు మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

