True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఇందిరమ్మ భీమాతో పేదలకు భరోసా

అమ్మాపురంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై అవగాహన

అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ: సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి

తొర్రూరు / అమ్మాపురం, నవంబర్ 21, ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని అమ్మాపురం సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి తెలిపారు.

శుక్రవారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యాలు, ప్రయోజనాలు, అర్హతలు, అమలు విధానంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుందని వివరించారు.

కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చే వ్యక్తికి అనుకోని ఆపద ఎదురైనప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా బీమా మొత్తం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని తెలిపారు.

18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల కుటుంబ పెద్దలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్‌తో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిరిపాటి విశాల్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

↑