నర్సింహులపేట,
ట్రూ టైమ్స్ ఇండియా
నవంబర్ 22:
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో నవంబర్ 22న తెలంగాణ అనుక్షణం దినపత్రిక విలేకరి గౌని ఉపేందర్ కుమార్తె స్నేహ వివాహ వేడుక రాకేష్ శర్మతో అత్యంత వైభవంగా జరిగింది బంధుమిత్రులు ఆత్మీయుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా జరిగిన ఈ శుభకార్యానికి స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు మీడియా ప్రతినిధులు మరియు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు
ఈ వివాహ వేడుకకు నర్సింహులపేట మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాల్సాని దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మండపంలోకి విచ్చేసిన ఆయనకు విలేకరి గౌని ఉపేందర్ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు అనంతరం వేడుకలో పాల్గొన్న కాల్సాని దామోదర్ రెడ్డి నూతన వధూవరులు స్నేహ రాకేష్ శర్మలకు పుష్పగుచ్ఛాలు అందజేసి అక్షింతలు వేసి ఆశీర్వదించారు నూతన దంపతులు అన్యోన్య దాంపత్యంతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా విలేకరి గౌని ఉపేందర్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు

