True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిరుపేదలకు కేటాయించాలి

 

డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ డిమాండ్

అక్రమాలకు పాల్పడితే ఆధారాలతో సహా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక

తొర్రూరు , ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి, నవంబర్ 15:మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హయాంలో తొర్రూరు పట్టణంలో నిర్మించిన 280 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను రాజకీయాలకు అతీతంగా అసలైన నిరుపేదలకు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు శనివారం తొర్రూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార పక్ష చైర్మన్ కౌన్సిలర్లు అధికారులు లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ ఇళ్లు కేటాయిస్తున్నారని దీనికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆరోపించారు ఇప్పటివరకు అర్హుల జాబితాను తమ కౌన్సిలర్లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు లబ్ధిదారులను పారదర్శకంగా డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేయాలని లేనిపక్షంలో అవినీతిపై ఆధారాలతో సహా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో నాయకులు చకిలాల మనిరాజ్ పేర్ల జంపన్న తూర్పాటి రవి అల్లం కవిత శ్యామ్ భూసాని జయమ్మ ఉప్పలయ్య కిన్నెర కవిత సతీష్ గుగులోత్ పద్మ ధారావత్ జైసింగ్ నాయక్ రాయిశెట్టి వెంకన్న కోట వెంకటేశ్వర్లు అంబర్ ఖాన్ రాజబాబు ఆశయ్య మల్లేష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు
↑