విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు టి.సి. వరుణ్ సన్మానం
శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపిన అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
అనంతపురం, ట్రూ టైమ్స్ ఇండియా: మడకశిర నియోజకవర్గంలో విజయం సాధించిన మున్సిపల్ చైర్మన్ శారద రాధాకృష్ణ, రత్నగిరి ఎంపీటీసీ లావణ్య గోపి, గుడిబండ ఎంపీటీసీ జ్యోతి శుక్రవారం రాంనగర్ కార్యాలయంలో అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టి.సి. వరుణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా టి.సి. వరుణ్ విజయం సాధించిన ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం విజయం సాధించిన అభ్యర్థులు టి.సి. వరుణ్‌తో పాటు స్టేట్ డైరెక్టర్లు అంకె ఈశ్వరయ్య, కుమ్మర నాగేంద్రలను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ ఇన్‌చార్జి రంగస్వామి, మండల అధ్యక్షుడు శివాజీ, టౌన్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

