రిటైర్డ్ ఐఎఎస్ అధికారిచే... ప్రాచీన ఆలయంలోప్రత్యేక పూజలు !

Malapati
0


ఉరవకొండ, ఏప్రిల్ 28:
కొట్టలపల్లి గ్రామంలోని ప్రాచీన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ నారాయణ, రాజేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం దేవాలయంకు చేరుకున్న వీరికి ఆలయ పూజారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ నారాయణ సహాధ్యాయి కావడంతో ఉరవకొండ నుంచే కాకుండా విడపనకల్లు మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు దేవాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడి సందడిగా మారింది. వందల సంవత్సరాల చరిత్రతో పాటు ఇక్కడి స్వామి మహా మహిమానిత్వుడు కావడం, భక్తుల కొంగు బంగారంగా పేరుగాంచడం వల్లనే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు డాక్టర్ లక్ష్మీ నారాయణ దంపతులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం అహరహం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయురారోగ్యాలతో పాటు మరింత భౌతిక శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సావిత్రమ్మ భర్త, సీనియర్ నాయకుడు చింబిలి వెంకటేశులు, రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకుడు గుర్రం చెన్నకేశవులు, ఆలం వెంకట నారాయణ, విడపనకల్లు మాజీ ఎంపీపీ సోమశేఖర నాయుడు, సీనియర్ నేతలు గొర్తి శ్రీరాములు, కరణం మహేష్, హనుమంతప్ప, రెడ్డిమాసి సత్యాన్నలతో పాటు దివంగత మంత్రి గుర్రం నారాయణప్ప కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!