ఈ నేపథ్యంలో 2018లో ఉరవకొండ కోర్టులో OS నంబర్ 54గా కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. అదే సమయంలో ఈ భూమికి సంబంధించిన వ్యవహారం జాయింట్ కలెక్టర్ పరిధిలో కూడా పెండింగ్‌లో ఉందని చెప్పారు. అయితే కేసు కోర్టులో ఉన్నప్పటికీ, సంబంధిత భూమిని ఇతరులకు విక్రయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటివరకు ఆ భూమిని తమ కుటుంబమే సాగు చేసుకుంటూ వస్తున్నామని, అయినప్పటికీ ఇటీవల అధికారులు మరియు కొందరు వ్యక్తులు పోలీసుల సహాయంతో ఒత్తిడి తెస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ చర్యలు తమపై అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు.ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్న ఆంజనేయుల కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం అతనికి చికిత్స అందుతున్నట్లు సమాచారం. ఘటనపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, భూమి వివాదం కారణంగా చిన్న ఆంజనేయులు గతంలోనే మానసికంగా కృంగిపోయి గుండె సంబంధిత సమస్యలతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై అధికారులు స్పందించి న్యాయమైన పరిష్కారం చూపాలని బాధిత కుటుంబం కోరుతోంది. కేసు న్యాయస్థానంలో కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయన్నది ఆసక్తికరంగా మారింది.

