నగరంలోని ప్రధాన కూడళ్లలో, వీధుల్లో ముందస్తు అడ్మిషన్ల పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విద్యాశాఖ అధికారులకు కనిపించకపోవడం ఆశ్చర్యకరమని వారు విమర్శించారు.
ఈ సందర్భంగా AIFDS రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధూ, PSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఆలం, AISP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ, YSRSU జిల్లా ప్రధాన కార్యదర్శి నిశాంత్, PSF జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతిభ భారతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ నాయకుడు పవన్ మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలు తప్పుడు హామీలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తూ మోసపూరిత ప్రచారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
విద్యాశాఖ అధికారులు కేవలం నోటీసులు జారీ చేయడానికే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అక్రమ ఫ్లెక్సీలు, ప్రచార కార్యక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అన్ని ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరారు.
ఇలాంటి చర్యలు కొనసాగితే విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టేందుకు వెనుకాడబోవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో YSRSU జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్, ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బాబా ఫక్రుద్దీన్, చిన్న, ప్రసాద్, మంజు, విశ్వ తదితరులు పాల్గొన్నారు.
