ఉరవకొండ: పవిత్ర శనివారం పురస్కరించుకుని ఉరవకొండ గ్రామ పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో వెలసిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. శనివారం నాటి విశేష ఘడియలలో స్వామివారు అత్యంత శోభాయమానమైన దివ్య మంగళ రూపంలో భక్తులకు దర్శనమిచ్చినట్లు ఎయిర్ టెల్ ప్రతాప్ తెలిపారు.
ఉదయం నుంచే ఆలయంలో సుప్రభాత సేవలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. అనంతరం అర్చకులు స్వామివారిని నయనానందకరంగా, పట్టువస్త్రాలు, సుగంధ భరిత పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. ఈ దివ్య అలంకరణ దర్శనాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆలయ ప్రాంగణమంతా “గోవిందా గోవిందా” నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు తమ కోరికలు తీర్చే కల్పవృక్షంగా శ్రీవారిని కొలిచి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని భక్తులు ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా డ్రైవర్స్ కాలనీ ప్రాంతం మొత్తం భక్తి భావంతో నిండిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి ప్రత్యేక అలంకరణ దర్శనం నేడు శనివారం రోజంతా అందుబాటులో ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
