ఉరవకొండ: ట్రూ టైమ్స్ ఇండియా వార్తా కథనానికి తక్షణ స్పందన లభించింది. ఇటీవల జరిగిన మంత్రి జన్మదిన వేడుకల్లో భాగంగా ధ్వంసమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూల్ ప్రధాన గేటును అధికారులు మరియు అభివృద్ధి కామకులు వెంటనే స్పందించి పునరుద్ధరించారు.
కొందరు అత్యుత్సాహవంతులైన కార్యకర్తల వల్ల ధ్వంసమైన గేటు అలాగే ఉండిపోయింది. దీనిపై కళాశాల మరియు విద్యా అధికారుల అలసత్వాన్ని ఎండగడుతూ ‘ట్రూ టైమ్స్ ఇండియా’ ప్రచురించిన కథనం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వార్తతో అధికారులు కళ్ళు తెరిచి, జరిగిన నష్టాన్ని గుర్తించారు.
ట్రూ టైమ్స్ ఇండియా కథనానికి స్పందించి, కళాశాల అభివృద్ధి కోసం పాటుపడే కొందరు స్థానిక ప్రముఖులు మరియు అధికారులు చొరవ తీసుకుని, తమ సొంత ఖర్చులతో ధ్వంసమైన గేటును పునరుద్ధరించడానికి ముందుకొచ్చారు. పగిలిపోయిన గేటును తిరిగి బాగుచేసి, పూర్వపు స్థితికి తీసుకువచ్చారు. అధికారుల మరియు అభివృద్ధి కామకుల ఈ తక్షణ స్పందన పట్ల విద్యార్థులు, భక్తులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, కళాశాల కోసం 14 ఎకరాల స్థలం దారాదత్తం చేసిన జగద్గురు శ్రీ కరిబసవ రాజేంద్ర స్వాముల పేరిట కూడా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కూడా అధికారులు పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.





