టీడీపీ వి మతి మాలిన మాటలు..

Malapati
0


 ‌జగన్ కు రాజకీయ లబ్ధి చేకూర్చడానికే హత్యలన్న టిడిపి మతిమాలిన మాటలు!వై సీపీ జోనల్ అధికార ప్రతి నిధి.. కేవి రమణ 

     జగన్ కు రాజకీయ లబ్ధి చేకూర్చడానికే వారి కుటుంబీకులను హత్యలు చేశారన్న టిడిపి నాయకులు అచ్చెన్నాయుడు,పయ్యావుల కేశవ్,సీఎం రమేష్ మతి లేని మాటలు.

    హత్యా రాజకీయాలే వైయస్సార్ కుటుంబ నేపథ్య మంటున్న వీరి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించి నట్లు ఉన్నాయి.

     సీఎం రమేష్ గారు చెప్పి నట్లు వైయస్ రాజారెడ్డి నేపథ్యం దొంగతనాలు అయితే సీఎం రమేష్ గారిది దొంగసారా వ్యాపారం కాదా? ఒకప్పుడు సీఎం రమేష్ కుటుంబం పరిస్థితి ఏమిటో రాయలసీమ ప్రజలకు తెలియదా?

     రాయలసీమలో పూర్వం వ్యక్తిగతమైన కక్షలు ఉండేటివి,వాటికి మొట్టమొదట రాజకీయ రంగు పులిమింది వైయస్ కుటుంబమే అంటున్న కేశవ్ కుటుంబం నేపథ్యం పేదలకు చెందాల్సిన,ఈత చెట్లను, ఈత కళ్ళును దౌర్జన్యంగా స్వాధీనం చేసుకొని డబ్బులు సంపాదించుకొని,తనకు రాజకీయంగా అడ్డు వస్తారన్న వారిని మోసపూరితంగా తమ చేతులకి రక్తం అంట కుండా తుద ముట్టించడం వాస్తవం కాదా? రాయలసీమ పాలెగాళ్ల నేపథ్యం కలిగిన కేశవ్ కుటుంబం,వీరి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన పోరాటాన్ని మరిపించడానికి కేశవ్ చేసే కొంగ జపం కాదా?

    వైసిపి గొడ్డలి పార్టీ అయితే టిడిపి వెన్నుపోటు పార్టీ ఎందుకు కాకూడదు?

     రాజారెడ్డిని హత్య చేసిన వారి ఆస్తులు ధ్వంసం చేశారని,నిందితులలో అందరినీ చంపేశారని, హత్యకు మూల కారణమైన పార్థసారథిని వికలాంగుడిగా చేసేసారంటున్న వీరు,పార్థ సారథి రెడ్డి మా టిడిపి నే అని ఎందుకు చెప్పడం లేదు? దీనిని బట్టి వెనకుండి రాజారెడ్డి గారిని మేమే హత్య చేయించామని ఒప్పు కున్నట్లేకదా?

     వివేకానంద రెడ్డి మరణం ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది? వివేకానంద రెడ్డిని నేనే హత్య చేశానని ఒప్పుకున్న ముద్దాయి దస్తగిరి ఎవరి దగ్గర ఉన్నాడు,ఎవరి అండతో దర్జాగా,జల్సాగా తిరుగు తున్నాడు?అది హత్యా? ఆత్మహత్యా? అనే విషయాన్ని ఎవరు తేల్చాలి, అప్పుడు అధికారంలో ఉన్న మీరు ఎందుకు తేల్చలేక పోయారు? తేల్చలేదంటే దీని వెనుక మీరు ఉన్నట్లే కదా?

     రాజశేఖర్ రెడ్డి గారి మరణం ముందు చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను జగన్ ఉటంకిస్తే మీకెందుకు ఉలికి పాటు? ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని తెలిసి,అభివృద్ధి మాది విధ్వంసం మీది అందుకే 11 సీట్లు వచ్చాయంటున్న మీకు 2019లో 26 సీట్లు వచ్చాయంటే అప్పుడు మీరు 2014 నుండి 2019 వరకు చేసింది విధ్వంసమేనా?

    అతి తెలివి మాటలు కుయుక్తులు,కుతంత్రాలు, టముకు టమారం గారడీలు చేసి గెలవడం కాదు,నిజమైన నాయకుడు ప్రజల మనసులను గెలవాలి అందుకే జగన్ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, మీరు అధికారంలో ఉన్నా ప్రజలు మిమ్ములను కన్నెత్తి చూడడం లేదు.ఇది నిజంగా ప్రజలు ఓడించిన ఓటమేనా? మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి,మీరు మారాలి, మంచి రాజకీయాలు చేయాలి,అప్పుడే సమాజానికి,ప్రజలకు మేలు జరుగుతుంది,లేకుంటే పాపి చిరాయువే. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!