ఉద్యోగులకు 30 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి: ఏపీటీఎఫ్-1938 డిమాండ్

Malapati
0

 


రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. హనుమప్ప డిమాండ్ చేశారు. గురువారం ఉరవకొండ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లు, జేఏసీ ప్రతినిధుల ముఖ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బి. హనుమప్ప మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. తక్షణమే 12వ పీఆర్‌సీ తో పాటు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ముఖ్యంగా 2022 సంవత్సరంలో ఉద్యోగులు సరెండర్ చేసిన ‘సరెండర్ లీవ్స్ బకాయిలను, 2018 నుండి వివిధ ట్రెజరీలలో పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు సంబంధించిన 342 జీవోపై ఉన్నత విద్య నిబంధనలను యథాతథంగా కొనసాగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు సాకే భాస్కర్, రాష్ట్ర కౌన్సిలర్ దీక్షా ఇలంధర్, తాలూకా జేఏసీ వైస్ చైర్మన్ ఎస్. కిషోర్, మండల అధ్యక్షుడు టి. గోపాల్, మండల ప్రధాన కార్యదర్శి ఎం. ఆదినారాయణ, బొమ్మనహాల్ మండల ప్రధాన కార్యదర్శి ఎన్. గోపాల్ నాయక్, నాసిర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!