వైయస్సార్సీపి బీసీ గళం సభ విజయవంతాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ శ్రేణులు.
రాష్ట్ర చరిత్రలో నా ఎస్సీ,నా ఎస్టి,నా బిసి అని ప్రకటించే దమ్ము ఉన్న నాయకుడు మీకు ఎవరైనా కనపడ్డారా?మీ నాయకుడు చంద్రబాబు చెప్పగలరా?
పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం వైయస్సార్సీపి చేస్తుంది (క్లాస్ వార్) అని ప్రకటించే దమ్ము తెలుగుదేశం పార్టీకి ఉందా?
హత్యా రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం,దాని పుట్టుకలోనే హత్యా రాజకీయాలు కనబడతాయి చుండూరులో ఎవరు ఎవరిని చంపి మూటలు కట్టారో జర్నలిస్టుగా పనిచేసిన మీకు తెలియవా?
చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు ఎన్టీఆర్ పేరు చెప్పుకోవడం కాదు,మీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరో ఈ సామాజిక వర్గానికి చెందినవారో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలి.
ప్రతి పార్టీకి అన్ని విభాగాలు ఉంటాయి అలాగే వైసిపికి, టిడిపికి కూడా బీసీ విభాగాలు ఉంటాయి, అలాంటప్పుడు నూటికి నూరు శాతం బీసీలే ఉండాలి ఆ విభాగాల మీటింగ్ లకు బీసీలు మాత్రమే రావాలంటున్న టిడిపి నాయకులు ఎన్నికలకు ముందు ఆ తరువాత టిడిపి నిర్వహించిన సభలలో ఇతర సామాజిక వర్గాలు లేరని ప్రకటించగలరా? అలా జరిగి ఉంటే నిన్నటి దినం ప్రెస్లో మాట్లాడిన టిడిపి నాయకులు కమ్మ వాళ్ళు స్థాపించిన టిడిపి పార్టీకి రాజీనామా చేయాలి.
తాను స్వయంగా పార్టీ పెట్టి బీసీలను గురించి మాట్లాడాలి కదా.కాలువ శ్రీనివాసులు బీసీ నాయకుడు కాదు వాల్మీకి ( బోయ) నాయకుడు మాత్రమే ఎందుకంటే అతను బోయ కులస్తులను ఎస్టీ జాబితా లోకి చేర్చాలని ఉద్యమం చేశాడే కానీ మిగతా బీసీల కోసం ఏనాడు పనిచేసిన దాఖలాలు కనపడవు.
దళితుల ఇండ్లలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నది ఎవరు?
నాయి బ్రాహ్మణులు, గంగపుత్రు తమ సమస్యలను చెప్పు కోవడానికి వెళ్లినప్పుడు మీ నాయకుడు చంద్రబాబు తోలు తీస్తా,తొక్క తీస్తానని మాట్లాడినది నిజం కాదా?
నిన్న లేక మొన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డప్పు కళాకారుని పై చేయి చేసుకోలేదా? ఇవి పెత్తందారుల లక్షణాలు కాదా?
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన దళిత ఎమ్మెల్యేలు,తెలుగుదేశం పార్టీలో మాకు గౌరవం లేదని బహిరంగ ప్రకటనలు ఇస్తూ రాజీనామాలకు ఎందుకు సిద్ధమవుతున్నారో సమాధానం చెప్పగలరా?
తెలుగుదేశం పార్టీ అంటే నాటి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీగానే కాలువ శ్రీనివాసులు ఊహించుకుంటున్నాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి లాగేసుకున్న సి బి ఎన్ పార్టీ అని మర్చిపోకూడదు.
తన మంత్రి పదవి కోసం మాటల గారడి చేస్తే తెలుసుకోలేని వెనుకబాటుతనం బీసీ లకు లేదు.
అంబేద్కర్,జ్యోతిబాపూలే మార్గం ఏదైతే ఉందో,విద్య ద్వారానే హక్కులు సంభవిస్తాయి,సమ సమాజ స్థాపన జరుగుతుందన్న మాటను నిజం చేయడానికి జగన్ ప్రభుత్వ విద్యను కార్పొరేట్ దీటుగా పేదలకు అందించడానికి చేసిన సామాజిక విప్లవకారుడు.
ఎవరి ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఈ సామాజిక వర్గానికి ఎన్ని పదవులు ఇచ్చారో బహిరంగ చర్చకు సిద్ధమా?
నిన్న జరిగిన వైఎస్ఆర్సిపి బీసీ గళం లో అందరూ గళం విప్పారు.అయితే ఈ జిల్లాకు సిబిఎన్,లోకేష్ వచ్చినప్పుడు ఇతరులు ఎవరైనా గళం విప్పే ధైర్యం చేయగలరా?
బీసీ గళంలో బీసీలు కనపడక పోవడం కాలువ శ్రీనివాసులు గారి అహంకారానికి,అసహనానికి బీసీల పట్ల లెక్కలేనితనానికి నిదర్శనం.
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరముల గడుస్తున్నా ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేర్చినారో చెప్పకుండా దాటవేసి,మాటల గారడీ చేస్తే వచ్చే రోజులలో బీసీలు కీలెరిగి వాత పెడతారు.
జగన్ సంక్షేమం అభివృద్ధిని బహుజనుల ఇళ్ల వద్దకు చేర్చి బహుజనుల ఆత్మగౌరవాన్ని పెంచితే నేడు మీరు రేషన్ వదులుకొని పెట్రోల్ వరకు పేదలను క్యూలో నిలబెట్టి అవమానిస్తుంటే సిగ్గుపడాలి.
బీసీల సభలకు బీసీలకు మద్దతుగా బీసీలే రావాలన్న ఆదిమ కాలం నాటి మాటలు పక్కన పెట్టాలి,బీసీలకు తోడుగా,నీడగా,మద్దతుగా వచ్చే అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవాలన్న సామాజిక స్పృహ తెలుగుదేశం పార్టీ నాయకులకు లేకపోవడం బాధాకరం.
