గవిమఠo లో కాయ గూరల మార్కెట్ఏర్పాటు హుళ్ళక్కెనా?

Malapati
0
25 ఏళ్లుగా అందని మార్కెట్ సౌకర్యం: ఉరవకొండలో వీధుల పాలవుతున్న కూరగాయల విక్రయాలు
 పప్పులు పంచి పోరు మార్పిన చందంగా గొడుగులు పంపిణీ తో సరి 

ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీలో మౌలిక సదుపాయాల కల్పనలో పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పట్టణంలో గత 25ఏళ్లుగా కూరగాయల మార్కెట్ సౌకర్యం లేక అటు విక్రేతలు, ఇటు వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంచాయతీ యంత్రాంగం పన్నులు వసూలు చేయడంలో చూపుతున్న ఉత్సాహం, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అప్పట్లో ప్రయత్నం.. ఆపై ఆక్రమణ!
పట్టణంలో కూరగాయల విక్రేతల ఇబ్బందులను గమనించి, 2000 సంవత్సరంలో నాటి యువమోర్చా నాయకులు మాలపాటి శ్రీనివాసులు, బిజెపి లాలప్ప, నాగేంద్ర తదితరులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీనికి స్పందించిన అప్పటి సర్పంచ్ పెద్దకోట్ల రామప్ప, ప్రస్తుత ఎమ్మెల్సీ శివరాం రెడ్డి చొరవ తీసుకుని సత్యసాయి భజన మందిరం సమీపంలోని పంచాయతీ స్థలంలో చిల్లర వర్తకుల కోసం మార్కెట్ ఏర్పాటు చేశారు. అయితే, ఆ స్థలంపై కన్నేసిన ఒక వ్యాపారి కుట్రలు పన్ని, వర్తకుల మధ్య చిచ్చు పెట్టి వారిని అక్కడి నుంచి చెల్లాచెదురు చేశారని, తద్వారా ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ట్రాఫిక్ సమస్య.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం
మార్కెట్ ప్రాంగణం లేకపోవడంతో వ్యాపారులు ప్రధాన రహదారులు, సత్యసాయి కాంప్లెక్స్, గడియార స్తంభం మరియు తెలుగు తల్లి విగ్రహం సమీపంలో ఫుట్‌పాత్‌లనే నమ్ముకున్నారు.
 ట్రాఫిక్ జామ్ రోడ్ల పక్కనే తోపుడు బండ్లు, గంపలతో వ్యాపారం చేస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
 *ఆరోగ్య ముప్పు: వాహనాల నుంచి వచ్చే దుమ్ము, ధూళి కూరగాయలపై పడుతుండటంతో, వాటిని కొనుగోలు చేసే ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది.
గవిమఠం ఆవరణలో ఏర్పాటు హుళక్కెనా?!
పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నా, కూరగాయల మార్కెట్ ఏర్పాటుపై పంచాయతీ పాలకవర్గం శ్రద్ధ వహించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవిమఠం మైదానం లేదా ఇతర ప్రభుత్వ స్థలాలను సేకరించి, శాశ్వత ప్రాతిపదికన కూరగాయల మార్కెట్ నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి, పేరుకే కాకుండా పనిలోనూ చిత్తశుద్ధి చూపి మార్కెట్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే పాలకులు ఆఘ మేఘాలపై కూరగాయాల మార్కెట్ ఏర్పాటు చేసున్నట్లు గుప్పించిన ప్రకటనలతో సంబర పడిన ప్రజలు, వినియోగదారుల ఆశలపై నేతలు నీళ్లు జల్లారు. ఎండనక వానననక రోడ్లపై విక్రయాలు సాగిస్తున్నారు. ఏడ్చే పిల్లవానికి పప్పులు పంచిన విధంగా గొడుగులు పంపిణీ చేసి చేతులు దులుపు కొన్నారు. కాయగూరల మార్కెట్ ఎప్పటి మారుస్తారో ట్రాఫిక్ సమస్య ఎప్పటికి తీరుతుందో అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న గా మిగిలిపోతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!