జర్నలిస్టులకు ప్రభుత్వాలు పూర్తి భద్రత కల్పించాలి
జర్నలిస్ట్ భద్రత కోసం పటిష్టమైన చట్టాలు రూపొంచాలి.
జర్నలిస్ట్ మీద చేయి వేయాలంటేనే భయపడేలా చట్టం రూపొందించాలి.
చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య అత్యంత దారుణమని, ఈ ఘటన ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా నిలుస్తోందని ఉరవకొండ నియోజకవర్గం సీనియర్ జర్నలిస్టులు మాలపాటి శ్రీనివాసులు, డి బాలచంద్ర ఖండించారు.ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా పిలువబడే జర్నలిజం రోజురోజుకీ తన స్వేచ్ఛను కోల్పోతూ ప్రమాదంలో పడుతోందని వారుఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, హత్యలు జరుగుతున్నాయి అనడం అత్యంత ఆందోళనకరమని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి హత్యను కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా కాకుండా, నిజాన్ని వెలికితీసే మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడిగా చూడాలని వారు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదే విధంగా జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధులు భయపడకుండా తమ విధులు నిర్వహించేలా అనుకూల వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు.జర్నలిజం స్వేచ్ఛను కాపాడటం ప్రతి ప్రభుత్వానికి బాధ్యత అని, లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని మేడా హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిన జర్నలిజం రోజురోజుకీ ప్రమాదంలో పడుతోందని, నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులకు ప్రభుత్వాలు పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, వారి విధుల నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు లేకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. జర్నలిస్టుల భద్రత కోసం పటిష్టమైన చట్టాలు రూపకల్పన చేయాలని, జర్నలిస్ట్‌పై చేయి వేయాలంటేనే భయపడేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని వారు స్పష్టం చేశారు.
