సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి....
సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కొనకండ్ల మండలంలో సత్యసాయి వాటర్ సప్లై చేసే దగ్గర నుండి ఏఐటియుసి సిఐటియు ఐఎఫ్టియు వైఎస్ఆర్టియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మహేష్ గారు మాట్లాడుతూ ఐదు నెలలు జీతాలు ఇవ్వకపోతే ఏం తిని బతకాలి...?? ఎలా బతకాలని...?? ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..?? మా జీవన గతి గురించి ఒక్కసారైనా జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మంత్రులు ఆలోచించారా, నీటి సమస్యలు లేకుండా చేస్తున్నామని ఒకవైపు ముఖ్యమంత్రి గారు ప్రలోభాలు పలుకుతున్నారు, కానీ కింద స్థాయిలో మంచినీరు వదిలే కార్మికుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఐదు నెలలు జీతాలు లేకుంటే ....?? మాకు ఆత్మహత్యలు గతేనా అని అధికారులను ప్రభుత్వాన్ని అడిగారు..?? తక్షణమే పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలి. పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలి. నీటి పథకాన్ని మరింత బలోపేతం చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేకపోతే గ్రామీణ స్థాయి నుండి అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపుని ఇవ్వాల్సి వస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.. తక్షణమే సత్యసాయి నీటి సరఫరా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిఐటియు ఐఎఫ్టియు వైఎస్ఆర్టియు నాయకులు పాల్గొనడం జరిగింది.

