ఉరవకొండ
ఉరవకొండ పట్టణంలో దివ్యాంగుల సంఘానికి కార్యాలయం నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం దివ్యాంగులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు శాశ్వత కార్యాలయం లేకపోవడంతో వివిధ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆందోళనకు తాలూకా సీపీఐ పార్టీ కార్యదర్శి చెన్నారాయుడు, సహాయ కార్యదర్శి నాగేంద్ర సంఘీభావం ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నారాయుడు మాట్లాడుతూ, దివ్యాంగుల కార్యాలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. దివ్యాంగుల సమస్యలను అధికారులు సానుకూలంగా పరిశీలించి వెంటనే స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.
దివ్యాంగుల హక్కుల సాధన కోసం సీపీఐ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం దివ్యాంగుల సంఘం నాయకులు, సభ్యులు కలిసి ఉరవకొండ తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని సమర్పించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు, రాము, అంజినప్ప, రామలింగేశ్వర, వలి తదితర దివ్యాంగులు పాల్గొన్నారు.

