ఉరవకొండలో కలకలం: నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయం.. ఏ.వీ.ఆర్ స్కూల్ బుక్స్ రూమ్ సీజ్!

Malapati
0




 

- విద్యార్థి సంఘాల దాడితో వెలుగుచూసిన అక్రమాలు

- కనీస వసతులు లేవు.. దోపిడీలో మాత్రం ‘కార్పొరేట్’!

- ఉపాధ్యాయులకు ‘నో వర్క్.. నో పే’.. తల్లిదండ్రులకు మాత్రం ఏడాది పొడుగునా వసూళ్లే!

 పీఎఫ్ నిబంధనలు ఉల్లంఘన.. లోకాయుక్త ఆదేశాలకూ తూట్లు!

:కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఉరవకొండలో ఐక్య విద్యార్థి సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, పాఠశాల ప్రాంగణంలోనే అక్రమంగా పుస్తకాలు విక్రయిస్తున్న స్థానిక ఏ.వీ.ఆర్ ఇంగ్లీష్ పాఠశాల* పుస్తకాల గదిని విద్యార్థి సంఘాల నాయకులు అధికారులతో కలిసి సోమవారం సీజ్ చేయించారు.

వేలల్లో వసూళ్లు.. తల్లిదండ్రుల ఆవేదన

కార్పొరేట్ పేరుతో ఏ.వీ.ఆర్ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పుస్తకాల పేరుతో వేలకు వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తోందంటూ పలువురు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకెళ్లారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఎలాంటి వ్యాపార లావాదేవీలు, పుస్తకాల విక్రయాలు జరపకూడదనే నియమాన్ని సదరు యాజమాన్యం తుంగలో తొక్కింది.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో సోమవారం ఉదయం ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా ఏ.వీ.ఆర్ పాఠశాలపై దాడి చేశారు. పాఠశాల లోపల యథేచ్ఛగా సాగుతున్న పుస్తకాల విక్రయాలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, వాటిని వెంటనే నిలిపివేయాలంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడికక్కడే విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని, అక్రమంగా పుస్తకాలు నిల్వ ఉంచిన గదిని అధికారుల సమక్షంలో *సీజ్* చేయించారు.

 నిబంధనలు ‘నగరం’.. వసతులు ‘శూన్యం’!

ఈ విద్యాసంస్థ అక్రమాలు కేవలం పుస్తకాల విక్రయాలకే పరిమితం కాలేదు. స్కూలుకు కనీస ప్రహరీ గోడ లేదు, విద్యార్థులు ఆడుకోవడానికి క్రీడా మైదానం లేదు. బస్టాండ్ పక్కనే ఉండటంతో నిరంతరం వాహన కాలుష్యం, హోరుమనే శబ్ద కాలుష్యంతో విద్యార్థుల ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటోంది. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేని ఇటువంటి వాతావరణంలో స్కూలు నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం కళ్లు లేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాతలు కోట్లు.. చేతలు శూన్యం

ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థలు కేవలం "గుర్తింపు పొందిన పాఠశాల" అని మాత్రమే బోర్డులపై రాసుకోవాలి. మరే ఇతర ప్రచారాలు చేయకూడదనే నిబంధన ఉంది. అయితే, ఏవీఆర్ యాజమాన్యం తమ స్కూలు వాహనాలపై ఒలింపియాడ్, ఐఐటీ, ఇతర ప్రత్యేక కోర్సుల శిక్షణ ఇస్తామంటూ భారీ ప్రచార రాతలు రాసి విద్యాశాఖ నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అంతర్యమేమిటని విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది.

ఉపాధ్యాయులకు శ్రమదోపిడీ.. యాజమాన్యానికి కాసుల పంట!

ఏవీఆర్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. *నో వర్క్.. నో పే అంటూ వేసవి సెలవుల్లో, సంవత్సరాంతపు సెలవుల్లో పనిచేసే ఉపాధ్యాయులకు యాజమాన్యం పైసా జీతం ఇవ్వడం లేదు. కానీ, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మాత్రం ఏడాది పొడుగునా ఫీజుల వసూళ్లు నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి. అటు ప్రైవేట్ ఉపాధ్యాయుల జీతాలను దొంగిలిస్తూ, ఇటు తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతూ విద్యను పూర్తి వ్యాపారంగా మార్చేసిన ఏకైక సంస్థ ఏవీఆర్ అని స్థానికులు మండిపడుతున్నారు.

 -కన్వీనర్.హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!