"మనం వృక్షాలను కాపాడితే.. ఆ వృక్షాలు మనల్ని కాపాడుతాయి" (వృక్షో రక్షతి రక్షితః) అనే గొప్ప సందేశంతో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
అనంతపురం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్* ఆధ్వర్యంలో ఉరవకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అమ్మ పేరిట ఒక మొక్క’కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి ఆమె పలుచోట్ల మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత:* ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య దగ్గుపాటి మాట్లాడుతూ.. మారుతున్న కాలంలో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని గుర్తుచేశారు.
అమ్మకు ఇచ్చే గొప్ప బహుమతి:* మనకు జన్మనిచ్చిన అమ్మ జ్ఞాపకార్థం ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కొక్క మొక్కనైనా నాటి, దానిని బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు.
మహిళల భాగస్వామ్యం: ఈ పచ్చదనం పెంపొందించే ఉద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. ప్రకృతిని గౌరవించడం, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే భావితరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమని ఈ సందర్భంగా నేతలు స్పష్టo చేశారు.
ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో స్థానిక బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.


