చిన్నారుల సమగ్ర అభివృద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగమే లక్ష్యంగా బుడగవి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ‘నవచేతన’ కార్యక్రమంతో పాటు కృత్రిమ మేధస్సు ఏ ఐ ఆధారిత స్క్రీనింగ్‌పై ఈ రోజు, రేపు (రెండు రోజుల పాటు) కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
సాంకేతికతతో ముందస్తు గుర్తింపు:చిన్నారులలో ఉండే ఎదుగుదల, అభివృద్ధి లోపాలను ఏ ఐ ఆధారిత స్క్రీనింగ్* ద్వారా ముందస్తుగానే గుర్తించే విధానాలపై కార్యకర్తలకు ప్రాయోగిక అవగాహన కల్పించారు.
బలమైన పునాది: ఈ సందర్భంగా సిడిపిఓ డాక్టర్ బి.ఎన్. శ్రీదేవి మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో అంగన్వాడీ కార్యకర్తలదే కీలక పాత్ర అన్నారు. ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ పిల్లల అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించాలని ఆమె సూచించారు.
ఏ ఐ స్క్రీనింగ్ ప్రాధాన్యత: పిల్లల అభ్యాస సామర్థ్యాలను, వారి అభివృద్ధి స్థితిని అంచనా వేయడంలో ఏ ఐ స్క్రీనింగ్ ఎలా ఉపయోగపడుతుందో డాక్టర్ లక్ష్మీ చందన కార్యకర్తలకు వివరించారు.
ఈ ఆధునిక శిక్షణ ద్వారా అంగన్వాడీ సేవల నాణ్యత మరింత పెరిగి, ప్రాథమిక బాల్య విద్య మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు రాజేశ్వరి, అరుణ, ఎంఎల్హెచ్‌పిలు అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

