ప్రాథమిక సమాచారం ప్రకారం, బెంగళూరు మరియు హర్యానా రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా డిఫెన్స్ ప్రీమియం లిక్కర్‌ను అక్రమంగా హైదరాబాద్‌కు దిగుమతి చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్‌రెడ్డి ప్రధాన పాత్రలో ఉన్నట్లు తేలడంతో ఆయనను అరెస్ట్ చేశారు.
దాడుల సమయంలో సుమారు రూ.10 లక్షల విలువ చేసే డిఫెన్స్ ప్రీమియం మద్యం సీజ్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మద్యం సాధారణంగా డిఫెన్స్ క్యాంటీన్‌ల ద్వారా మాత్రమే లభించాల్సి ఉండగా, దాన్ని అక్రమంగా మార్కెట్‌లోకి తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని విచారణలో బయటపడింది.
ఈ ఘటనపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని, ఈ రాకెట్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.

